విశాఖ: 18 ఆగస్టు (హి.స.)ఏపీలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. అందులో భాగంగా విశాఖ,అల్లూరి జిల్లాలోని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా సెలవు ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కొడుతున్న వానలకు చాల జిల్లాలు జలమయం అయ్యాయి. జన సంచారం స్థంబించిపోయింది. రవాణా వ్యవస్థ డీలా పడింది. దీంతో ముందస్తూ.. చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలువు ప్రకటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ