తిరుపతి, 18 ఆగస్టు (హి.స.)
: మూడు బోన్లు ఏర్పాటు చేసినా నెల రోజులుగా తప్పించుకు తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. ఎస్వీయూ క్యాంపస్‌లోని ఏడీ బిల్డింగ్ వెనుక ఫారెస్ట్ అధికారులు ఉంచిన బోనులో చిక్కింది. వర్సిటీ క్యాంపస్‌లోని కుక్కలు, జింకలపై దాడి చేసి చంపేస్తుండటంతో యూనివర్సిటీ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో నెల రోజుల క్రితమే వర్సిటీలోని పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. తాజాగా బంధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ