హైదరాబాదులోన్మరో విషాదకరమైన ఘటన ఉప్పల్ పోలీసుస్టేషన్ పరిధిలో
హైదరాబాద్ 18 ఆగస్టు (హి.స.) :తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ గోఖలే నగర్‌లో యాదవ్ సంఘం ఫంక్షన్ హాల్ వద్ద శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణుడు విగ్రహం కలిగిన రథం బండి ఊరేగింపు నిర్
बिजली की चेपट में,


హైదరాబాద్ 18 ఆగస్టు (హి.స.)

:తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ గోఖలే నగర్‌లో యాదవ్ సంఘం ఫంక్షన్ హాల్ వద్ద శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణుడు విగ్రహం కలిగిన రథం బండి ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు ముగించుకుని 9 మంది సభ్యులు రథంను లోపలకి తోసుకుంటూ వెళ్తున్న సమయంలో రథంకు విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 5 మంది మృతి చెందాగా.. మరో 4 గురి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్( 24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్(34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి(39)లు ఉన్నారు. ఈ ఘటనతో నగరమంత ఒకసారిగా ఉలిక్కిపడింది. ఊరేగింపులో విషాదకర ఘటన చోటుచేసుకోవడంతో.. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా.. విలపిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande