రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ విధానంలో నూతన వార్డు ఏర్పాటుకు రెండు.జీవోలు విడుదల
మదనపల్లె 18 ఆగస్టు (హి.స.):రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ విధానంలో నూతన వార్డ ఏర్పాటుకు రెండు జీవోలు విడుదల చేసింది. అందులో 275 జీవో ప్రకారం ఎక్సైజ్ శాఖ పాలసీ 276 జీవోఎం.ఎస్ ప్రకారం నిబంధనలు విడుదల చేసింది. మూడేళ్ల పాటు లైసెన్స్ ఇవ్వనున్న ఈ బా
రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ విధానంలో నూతన వార్డు ఏర్పాటుకు రెండు.జీవోలు విడుదల


మదనపల్లె 18 ఆగస్టు (హి.స.):రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ విధానంలో నూతన వార్డ ఏర్పాటుకు రెండు జీవోలు విడుదల చేసింది. అందులో 275 జీవో ప్రకారం ఎక్సైజ్ శాఖ పాలసీ 276 జీవోఎం.ఎస్ ప్రకారం నిబంధనలు విడుదల చేసింది. మూడేళ్ల పాటు లైసెన్స్ ఇవ్వనున్న ఈ బార్ల కేటాయింపును వైసీపీ ప్రభుత్వంలో వేలం పాటలు నిర్వహించగా, కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ప్రైవేటు మద్యం దుకాణాల కేటాయింపులో పాటించిన లాటరీ వద్దతిలోనే ఈసారి కొత్త బార్లకు లైసెన్సీలను ఎంపిక చేయనున్నారు. గతంలో ఈ-వేలం పాటల్లో రూ.కోటి వరకు పలికిన ఒక్కో బార్ లైసెన్సు. ఈసారి కొత్త పాలసీ ప్రకారం కేవలం రూ.50 లక్లలు మాత్రమే పలకనుంది. దీంతో మద్యం వ్యాపారుల మధ్య పోటీ పెరిగనున్నట్లు ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. కానీ వైసీపీ ప్రభుత్వ తప్పిదంతో ఏఈఆర్టీ 15 శాతం పెంచడంతో అనుభవం గల మద్యం వ్యాపారులు ఆలోచనలో పడిపోయారు. జిల్లాలో పెరగనున్న బార్ల సంఖ్య జిల్లాలో ఇది వరకు 11 బార్లు, హార్సిలీహిల్స్లో ఒక టూరిజం బార్ నడిచాయి. ఈనెల 31వ తేదీకి ఈ బార్ లైసెన్సులు అన్నీ రద్దు కానున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande