అమరావతి, 13 ఆగస్టు (హి.స.)
అమరావతి: కుప్పం నియోజకవర్గానికి చెందిన వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కుప్పం మార్కెట్ కమిటీ, పలమనేరు-కుప్పం-మదనపల్లె అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సహా వివిధ పదవులను భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలమనేరు-కుప్పం-మదనపల్లె అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా డాక్టర్ బీఆర్ సురేశ్‌బాబును నియమించారు.
కుప్పం మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా జీఎం రాజు, వైస్ ఛైర్మన్‌గా ప్రియ శరవణ సహా కమిటీ సభ్యులుగా 13 మందికి అవకాశం కల్పించారు. కుప్పం రెస్కో ఛైర్మన్‌గా వీజీ ప్రతాప్‌కుమార్, వైస్ ఛైర్మన్‌గా జి.విశ్వనాథ్‌లను ఎంపిక చేశారు. రెస్కో సభ్యులుగా 13 మందికి అవకాశమిచ్చారు. కుప్పం ఏరియా ఆస్పత్రి కమిటీ వైస్ ఛైర్మన్‌గా భారతీ త్రిలోక్‌తో పాటు సభ్యులుగా ఐదుగురిని నియమించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ