హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు
దంచికొడుతున్న విషయం తెలిసిందే. దీంతో బుధవారం కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలు వెంటనే వేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ ఆస్తుల వివరాలు వెంటనే పంపాలనీ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. భారీ వర్షాలు ఉన్నందున.. వరదలల్లో ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. మండల కమిటీలను నెలాఖరులోగా వేయాలి.. గ్రామ కమిటీలను సెప్టెంబర్ 15 వరకు పూర్తి చేసి పంపాలని చెప్పారు.
24 నుంచి రెండవ విడత జనహిత పాదయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. పాదయాత్రలో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనేలా ప్రణాళికలు చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లో బాగా ప్రచారం చేపట్టాలని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్