సీఎం రేవంత్రెడ్డి కి షాక్..! ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే..!
హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.) ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్ లకు బిగ్ షాక్ తగిలింది. వారి నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. కాగా, వీరిద్దరూ తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసి
సుప్రీంకోర్టు స్టే


హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)

ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్ లకు బిగ్ షాక్ తగిలింది. వారి నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. కాగా, వీరిద్దరూ తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే, వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టు, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. వారి నియామకం చెల్లదని తీర్పును వెలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.

వివరాల్లోకి వెళితే.. 2023 ఆగస్టులో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. అయితే, అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పలు కారణంతో తిరస్కరించారు. అనంతరం 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండారాం, అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసింది. వీరి నామినేషన్లను గవర్నర్ ఆమోదించారు. అయితే దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ గవర్నర్ తమ నామినేషన్లను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande