వరద ప్రాంతాలను పరిశీలించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్
సూర్యాపేట, 13 ఆగస్టు (హి.స.) సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దొండపాడ
సూర్యాపేట కలెక్టర్


సూర్యాపేట, 13 ఆగస్టు (హి.స.) సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దొండపాడు ఎర్రవాగు, బైపాస్ రోడ్డు వద్ద వరద ఉధృతి స్వయంగా పరిశీలించడానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, ఎటువంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లరాదని ఆయన హెచ్చరించారు. స్థానిక పరిస్థితులను అంచనా వేసి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande