ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట..
తెలంగాణ, ఆసిఫాబాద్. 14 ఆగస్టు (హి.స.) ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు గురువారం కొట్టివేసింది. కోవా ల
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే


తెలంగాణ, ఆసిఫాబాద్. 14 ఆగస్టు (హి.స.)

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు గురువారం కొట్టివేసింది. కోవా లక్ష్మి 2023 ఎన్నికల్లో తను ఎన్నికల కమిషన్కు అందజేసిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె ఎన్నిక చెల్లదని హైకోర్టులో శ్యాం నాయక్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు కోవా లక్ష్మీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో శ్యాం నాయక్ హైకోర్ట్ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు కూడా శ్యాం పిటిషన్ను కొట్టేసింది. అత్యున్నత న్యాయస్థానంలోనూ కోవా లక్ష్మికి అనుకూలంగా తీర్పు రావడంతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande