యూరియా పై డిబేట్కు నేను సిద్ధం.. దమ్ముంటే మీరు రండి! రామచంద్ర రావు
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) ఏ రాష్ట్రంలో రాని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు వస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. గతం కన్నా ఎక్కువ తెలంగాణకు కేంద్రం ఇచ్చిందని, ఇంకా కొంత మొత్తమే ఇవ్వాల్సి ఉందన్నారు. యూరియా ఏమవుతుం
రామచంద్రరావు


హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)

ఏ రాష్ట్రంలో రాని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు వస్తుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. గతం కన్నా ఎక్కువ తెలంగాణకు కేంద్రం ఇచ్చిందని, ఇంకా కొంత మొత్తమే ఇవ్వాల్సి ఉందన్నారు. యూరియా ఏమవుతుంది, ఎవరు తింటున్నారు అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులే ఫెర్టిలైజర్ షాపులకు వెళ్లకుండా డైవర్ట్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ కృత్రిమ కొరత సృష్టిస్తుందని ఎద్దేవా చేశారు. యూరియా కొరతపై తాను డిబేట్కు సిద్ధం అని, దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు చర్చకు రండని రాంచందర్ రావు సవాల్ విసిరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande