పోడు రైతుల అరెస్ట్ పిరికిపంద చర్య.. కాంగ్రెస్ సర్కార్పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
కాగజ్ గర్, 14 ఆగస్టు (హి.స.) తమ పోడు భూములకు పట్టాలిచ్చి, అటవీ అధికారుల దౌర్జన్యాల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి దిందా గ్రామం నుండి హైదరాబాద్కు 400 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్తున్న పోడు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అ
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్


కాగజ్ గర్, 14 ఆగస్టు (హి.స.)

తమ పోడు భూములకు పట్టాలిచ్చి, అటవీ అధికారుల దౌర్జన్యాల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి దిందా గ్రామం నుండి హైదరాబాద్కు 400 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్తున్న పోడు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం పిరికిచర్య అని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

రైతులు తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే అరెస్ట్ చేయడమేంటన్నారు. ముఖ్యమంత్రి బాధలు వినాల్సింది పోయి, న్యాయం చేయకుండా పోలీసులచే అరెస్టు చేయడం దారుణమన్నారు. రైతు డిక్లరేషన్ పేరు చెప్పి రైతులకు బేడీలు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. లగచర్లలో గద్వాలలో రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం నేడు దిందా రైతులను అరెస్ట్ చేసిందని ధ్వజమెత్తారు.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande