ఇద్దరు జవాన్లు సహా కనీసం 33 మంది మరణించారు
హిమాలయలోని మాతా చండి పుణ్యక్షేత్రానికి వెళ్లే మచైల్ మాతా యాత్ర మార్గంలో ఈ విపత్తు
ఇద్దరు జవాన్లు సహా కనీసం 33 మంది మరణించారు


హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)జమ్మూ కశ్మీర్‌ కిష్త్వార్‌లోని చోసిటి గ్రామంలో గురువారం భారీ మేఘాల విస్ఫోటం(క్లౌడ్‌బరస్ట్‌) సంభవించిన విషయం తెలిసిందే. దీంతో సంభవించిన ఆకస్మిక వరదలు, పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి. ఇప్పటి వరకు ఇద్దరు CISF జవాన్లు సహా కనీసం 33 మంది మరణించారు. 120 మందికి పైగా గాయపడ్డారు. బాధితులను కాపాడేందుకు కోసం రెస్క్యూ బృందాలు పరుగులు తీస్తున్నాయి. 220 మందికి పైగా ప్రజలు గల్లంతయినట్లు తెలుస్తోంది. హిమాలయలోని మాతా చండి పుణ్యక్షేత్రానికి వెళ్లే మచైల్ మాతా యాత్ర మార్గంలో ఈ విపత్తు సంభవించింది. దీంతో తీర్థయాత్ర మార్గం మొత్తం గందరగోళంగా మారింది. కిష్త్వార్ ప్రాంతంలో పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించానని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం నుంచి సమాచారం నెమ్మదిగా వస్తోందని సహాయక చర్యల కోసం సాధ్యమైన అన్ని వనరులను సమీకరిస్తున్నామని స్పష్టం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande