చెన్నైన్యూఢిల్లీ: , 18 ఆగస్టు (హి.స.), న్యూస్‌టుడే: తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవికి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అభిప్రాయభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఆదివారం ధర్మపురిలో పలు కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేసే విమర్శలపై తనకు ఆందోళన లేదన్నారు. రాజకీయాల్లో అవన్నీ సహజమేనన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నియమించిన గవర్నర్ రవి.. వారికంటే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్‌భవన్‌లో ఉండి అధికార డీఎంకేకు వ్యతిరేకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం ప్రతిపాదించిన బిల్లులను ఆయన ఆమోదించరని, తమిళగీతాన్ని అగౌరవపరుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో విద్య, శాంతిభద్రతలు, మహిళల భద్రతపై నిరాధార ఆరోపణలు చేసి భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ