జలదిగ్బంధంలో ఆర్థిక రాజధాని.. జనజీవనం అస్తవ్యస్తం
ముంబై, 18 ఆగస్టు (హి.స.) ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. దీంతో వ
ముంబై వర్షాలు


ముంబై, 18 ఆగస్టు (హి.స.)

ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పాఠశాలలకు బీఎంసీ సెలవు ప్రకటించింది. ఇక లోకల్ ట్రైన్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

గత శనివారం మొదలైన వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. మూడు రోజుల నుంచి నిరంతరాయంగా వాన పడుతూనే ఉంది. సోమవారం ఉదయం కూడా భారీ వర్షం కురిసింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలోని కుర్లా, సియోన్, కింగ్స్ సర్కిల్, హింద్మాతా, అంధేరి, పరేల్ వంటి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దక్షిణ ముంబైలోని కింగ్స్ సర్కిల్లో మోకాలి లోతు నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక జేపీ రోడ్, మిలన్ సబ్వే, ఎల్బీఎస్ రోడ్లోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో కూడా భారీగా వర్షపునీరు ఆగిపోయింది. దీని కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande