తెలంగాణ, వికారాబాద్. 14 ఆగస్టు (హి.స.)
వికారాబాద్ జిల్లా పరిగి మండలం
బసిరెడ్డిపల్లిలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించిందని స్థానికులు తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పెద్దశబ్దంతో సుమారు మూడు నుంచి నాలుగు సెకండ్లు భూమి కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంట్లో ఉన్న కాళీ వంట పాత్రలు కింద పడటంతో గ్రామస్తులు భయంతో బయటికి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పరిగి సీఐ సామల శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ ఐ మోహన్ కృష్ణ తన సిబ్బందితో కలిసి బసిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకున్నారు. బసిరెడ్డిపల్లితో పాటు రంగాపూర్ న్యామత్ నగర్, హనుమాన్ గండి, దేవనోని గూడ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు