శ్రీ శైలం.జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది
శ్రీశైలం, 14 ఆగస్టు (హి.స.) శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుండటంతో మరో గేటు మూసేశారు. ప్రస్తుతం 4 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలంల
శ్రీ శైలం.జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది


శ్రీశైలం, 14 ఆగస్టు (హి.స.)

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుండటంతో మరో గేటు మూసేశారు. ప్రస్తుతం 4 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 1,92,789 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం నుంచి 2,07,774 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. క్రమంగంటగుతోంది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,667 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాలుగు స్పిల్ వే గేట్ల ద్వారా 1,06,792 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు చేరింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande