భీమునిపట్నం లో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో.భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ధులు హర ఘర్ తిరంగా కార్యక్రమం
భీమునిపట్నం, 14 ఆగస్టు (హి.స.) : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం భీమునిపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు విన్నూత్నంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఇక్కడి బీచ్‌లో భారతదేశం చిత్రపటం ఆక
భీమునిపట్నం లో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో.భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ధులు హర ఘర్ తిరంగా కార్యక్రమం


భీమునిపట్నం, 14 ఆగస్టు (హి.స.)

: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం భీమునిపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు విన్నూత్నంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఇక్కడి బీచ్‌లో భారతదేశం చిత్రపటం ఆకృతిలో మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం బీచ్ నుంచి గంటస్తంభం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు డా. పి.సురేఖ మాట్లాడుతూ.. ప్రతీ పౌరుడు దేశభక్తితో జీవిస్తూ సమాజ వికాసానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande