హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
రెండు రోజులుగా కురుస్తున్న భారీ
ఉండాలని, వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా అధికారులు సహాయక చర్యలు ఎప్పటికప్పుడు చేపట్టాలని గ్రేటర్ కమిషనర్ ఆర్.వి కర్ణన్ సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గురువారం దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి రాజేంద్రనగర్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
హిమాయత్ సాగర్ 8 గేట్లు తెరవడంతో రాజేంద్రనగర్ డివిజన్లోని హైదర్ ఎన్స్లేవ్ మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు దాదాపు 15 ఇళ్లల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మీగూడా, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలను సందర్శించి ఇన్నర్ రింగ్ రోడ్డు పై నిలిచిన వర్షం నీటిని పరిశీలించారు. జల్ పల్లి కొత్తచెరువు నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాంతో ప్రయాణికులు పడుతున్న అవస్థలు తెలుసుకొని వరద నీటిని పక్కదారి మళ్ళించారు. వర్షానంతరం చర్యల్లో భాగంగా ప్రధాన రోడ్ల పై నిలిచిన నీటిని త్వరితగతిన తొలగించాలని అధికారులకు సూచించారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్