సూర్యాపేట, కోదాడలో విస్తారంగా వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.
తెలంగాణ, సూర్యాపేట. 14 ఆగస్టు (హి.స.) సూర్యాపేట జిల్లాలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరులో కురిసన వానలకు మోడల్ స్కూల్ చెరువును తలపిస్తున్నది. కోదాడలోని పలు కాలనీల్లో వరద నీరు నిలిచి
సూర్యాపేట వర్షాలు


తెలంగాణ, సూర్యాపేట. 14 ఆగస్టు (హి.స.)

సూర్యాపేట జిల్లాలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరులో కురిసన వానలకు మోడల్ స్కూల్ చెరువును తలపిస్తున్నది. కోదాడలోని పలు కాలనీల్లో వరద నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోదాడ పెద్ద చెరువు మత్తడి పోయడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మోతె మండలం ఉర్లుగొండ వద్ద పాలేరు వాగు పొంగిపొర్లుతున్నది.

కూచిపూడి, తొగర్రాయి వద్ద అంతరగంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. చిలుకూరు మండలంలో నారాయణపురం, బేతవోలు చెరువులు అలుగు పారుతున్నాయి. నడిగూడెం మండలం రత్నవరం వాగు ఉధృతితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande