హిమాయత్సాగర్ కు పోటెత్తిన వరద.. 8 గేట్లు ఎత్తివేత
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా, 2.6
హిమాయత్ సాగర్


హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా, 2.64 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రస్తుతం జలాశయంలోకి 17 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 7,926 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ సాయంత్రానికి మరో రెండు గేట్లను ఎత్తనున్నట్లు తెలుస్తున్నది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande