దిల్లీ: ,14 ఆగస్టు (హి.స.) నగరాలు, పట్టణాల్లో కొత్త పొదుపు ఖాతాల కనీస నిల్వ మొత్తాన్ని రూ.50,000కు పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు దిగొచ్చింది. దానిని రూ.15,000కు తగ్గించింది. వినియోగదారుల నుంచి వచ్చిన విలువైన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కనీస నిల్వ మొత్తాన్ని తగ్గించాలని నిర్ణయించినట్లు బుధవారం ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి కనీస నిల్వ మొత్తాన్ని రూ.10,000 నుంచి రూ.50,000కు పెంచుతున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు ఇటీవల ప్రకటించింది. దానిని రిజర్వు బ్యాంకు గవర్నర్ సమర్థించారు. అది బ్యాంకుల ఇష్టమని పేర్కొన్నారు. ఆయన ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే ఐసీఐసీఐ బ్యాంకు దిగిరావడం గమనార్హం. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనూ రూ.7,500, రూ.2,500కు కనీస నిల్వ మొత్తాన్ని తగ్గించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ