డేంజర్లో సింగూర్ డ్యామ్.. ప్రాజెక్టులపై కేటీఆర్ ప్రశ్నలు.
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.) సింగూరు డ్యామ్కు ముప్పు పొంచి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు, నిన్న మంజీరా బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు, న
కేటీఆర్


హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)

సింగూరు డ్యామ్కు ముప్పు పొంచి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు, నిన్న మంజీరా బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు, నేడు సింగూరు డ్యామ్ కు మోగిన డేంజర్ బెల్స్ అని పేర్కొన్నారు. ఇతర ప్రాజెక్టులకు రిపేర్లు వస్తే తప్పులేదనట్టు ఫోజులు కొట్టే కాంగ్రెస్, బీజేపీ నేతలు.. కాళేశ్వరంపై మాత్రం బురద జల్లడం.. వాళ్ల దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్రాజెక్టులు కట్టాక రిపేర్లు వస్తుంటాయనే విషయాన్ని మభ్యపెట్టి కేవలం మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పిల్లర్లను బూచిగా చూపించి కమిషన్ల పేరిట కక్షగట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతో పాటు బలహీనంగా ఉన్న ఇతర గేట్ల రోప్లను అలాగే గాలికొదిలేస్తే ప్రాజెక్టు నిలుస్తుందా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం చేసిన హెచ్చరికపై సోయి లేకపోతే మంజీరాకు మనుగడ ఉంటుందా? అని నిలదీశారు. ఇవాళ సింగూరు డ్యామ్ కు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అదే ఎన్డీఎస్ఏ హెచ్చరికను కూడా అలాగే పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా? అని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande