మరో బాహుబలి మోటార్ ఆన్.. ఎల్లపల్లి నుంచి రాజరాజేశ్వర జలాశయానికి కాళేశ్వర జలాలు
తెలంగాణ, పెద్దపల్లి. 14 ఆగస్టు (హి.స.) కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బాహుబలి మోటార్ల ద్వారా నీళ్ల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్లో నిన్న 2, 4, 5 నంబర్ల మోటార్ల
కాలేశ్వరం


తెలంగాణ, పెద్దపల్లి. 14 ఆగస్టు (హి.స.)

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి బాహుబలి మోటార్ల ద్వారా నీళ్ల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్లో నిన్న 2, 4, 5 నంబర్ల మోటార్లను నడిపించిన అధికారులు.. తాజాగా నేడు గురువారం మరో పంప్ను ఆన్ చేశారు. కడెం ప్రాజెక్టులో గేట్లు ఎత్తడం గోదావరిలో నీటి ప్రవాహం పెరగడంతో నంది పంప్ హౌస్లో గురువారం ఉదయం 7.30 గంటలకు 6వ నంబర్ మోటర్ను ఆన్ చేశారు. దీంతో శ్రీ రాజరాజేశ్వర జలాశయంవైపు కాళేశ్వర జలాలు పరుగులు పెడుతున్నాయి.

ఒక్కో మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 4 మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల చొప్పున నీరు పంపింగ్ అవుతోంది. కాగా నంది రిజర్వాయర్ ప్రధాన గేట్ల ద్వారా అదే పరిమాణంలో గ్రావిటీ కాల్వ ద్వారా వెళ్లి రెండు అండర్ టన్నెల్ల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్కు నీరు సరఫరా అవుతాయి. అక్కడి పంప్ హౌస్లో 4 మోటార్లను ఆన్ చేసి అదే పరిమాణంలో శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి నీటి సరఫరా అవుతున్నట్లు నీటిపారుదల శాఖ డీడీఈ గోనిగంటి నర్సింగరావు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande