సబ్బవరం.మండలం బంజరీ వద్ద. మహిళను హత్యచేసి కాల్చి పడేశారు
అనకాపల్లి, 14 ఆగస్టు (హి.స.) :సబ్బవరం మండలం బంజరి వద్ద గుర్తు తెలియని మహిళను హత్య చేసి కొంతమంది దుండగులు కాల్చిపడేశారు. ఆమె గర్భవతీగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా పరిశీలించారు.
Crime


అనకాపల్లి, 14 ఆగస్టు (హి.స.)

:సబ్బవరం మండలం బంజరి వద్ద గుర్తు తెలియని మహిళను హత్య చేసి కొంతమంది దుండగులు కాల్చిపడేశారు. ఆమె గర్భవతీగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా పరిశీలించారు. సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తనిఖీలు చేపట్టారు. హతురాలి వయసు 32 నుంచి 35 సంవత్సరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాళ్లు చేతులు కట్టేసి పీక నులిమి చంపేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులను వివరాల అడిగి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తెలుసుకున్నారు. హత్య కేసును ఛేదించేందుకు పోలీసు బృందాల అన్వేషిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande