హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఇవాళ సెక్రటేరియట్ నుండి మంత్రి పొంగులేటి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సీఎస్ కె.రామకృష్ణరావుతో పాటు జిల్లా కలెక్టర్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. వివిధ జిల్లాల్లోని పరిస్థితి గురించి ఆయా జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్న మంత్రి.. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఆదేశించారు. వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాల దృష్ట్యా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. స
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..