నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత
నల్గొండ, 14 ఆగస్టు (హి.స.) ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో జలాశయం అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను 10 అడుగుల మేర, 18 గేట్లను 5 అడుగుల మేర
సాగర్ ప్రాజెక్ట్ సాగర్


నల్గొండ, 14 ఆగస్టు (హి.స.)

ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో జలాశయం అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను 10 అడుగుల మేర, 18 గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి 2,60,344 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. ప్రస్తుత నీటి మట్టం 588.40 అడుగులు. సాగర్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలకుగాను ప్రస్తుతం 307.2834 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టులోకి 2,52,840 క్యూసెక్కుల వరద వస్తుండగా, 2,92,826 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande