అమరావతి, 14 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్: హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ పురాతన భవనం కుప్పకూలింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకొందని, దాన్ని కూల్చేయాలని గతంలోనే జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ భవనం యజమానికి నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. బేగంబజార్‌లో ఇలాంటి పురాతన భవనాల్లోనే వ్యాపారులు ఇప్పటికీ దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివాటిపై బల్దియా అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయడమే కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ