సిద్దిపేట, 14 ఆగస్టు (హి.స.)
జాతీయ జెండా ఆవిష్కరణ కోసం
జెండా పనులు చేస్తుండగా ప్రమాద వశాత్తూ విద్యుత్ షాక్ తో గ్రామపంచాయతీ కార్మికుడు మృతి చెందిన సంఘటన చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి ఎండీ. మోహిన్ పాషా (32) వేచరేణి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ కోసం విధినిర్వహణలో భాగంగా జెండా పైపు (ఇనుప) శుభ్రం చేస్తున్న క్రమంలో పైపు ప్రమాద వశాత్తూ 11 కేవీ విద్యుత్ వైర్లకు తగలడంతో మోహిన్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..