గేదెను తప్పించబోయి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు..ఇద్దరు యువకుల దుర్మరణం
తెలంగాణ, జగిత్యాల. 14 ఆగస్టు (హి.స.) జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని హరిత హోటల్ వద్ద బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా దానిపై ప్రయాణి
రోడ్డు ప్రమాదం


తెలంగాణ, జగిత్యాల. 14 ఆగస్టు (హి.స.)

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని హరిత

హోటల్ వద్ద బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాయపట్నం వైపు నుంచి వస్తూ హరిత హోటల్ వద్ద ఎదురుగా ఉన్న గేదెను తప్పించబోయి అదుపు తప్పి అటువైపుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పైన ఉన్న మంచిర్యాల జిల్లా లక్షట్టి పేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన ముచ్చకూర్తి అనిల్ అనే కానిస్టేబుల్, మేడి గణేష్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande