అమరావతి, 14 ఆగస్టు (హి.స.)
, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 15వ తేదీన గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అన్నీ రాష్ట్రాలకు లేఖలు రాసింది. పీఎం-సూర్యఘర్, పీఎం-కుసుమ లాంటి పథకాలతో సంప్రదాయేతర ఇంధన వనరులను సద్వినియోగం చేసుకునేలా గ్రామ పంచాయతీలు ప్రజలను ప్రోత్సహించాలని, గ్రామాల్లో వదిలేసిన పశువులకు మేత, షెడ్లు కల్పించేలా పంచాయతీలు చర్యలు తీసుకోవాలని, గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 9 అంశాలపై డేటా సేకరించే అంశంపై గ్రామ పంచాయతీలు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ