కడప, 14 ఆగస్టు (హి.స.) :పులివెందు ఒంటిమిట్ట)జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్)ఆదేశించారు. మంగళవారం రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. పులివెందుల ఉపఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి 10 టేబుళ్లు, 1 రౌండ్లో ఫలితాలు లెక్కిస్తామని తెలిపారు. అలాగే ఒంటిమిట్ట ఉపఎన్నికలకు 10 టేబుళ్లు, 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. ఒక్కో టేబుల్‌కు ఓ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్ల చొప్పున సూపర్‌వైజర్ర్లు 30 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు 60 మంది, స్టాటికల్ అధికారులు ముగ్గురు ఇతర సిబ్బంది కలిపి దాదాపు 100 మంది ఉంటారని పేర్కొన్నారు. అందరూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జడ్పీ సీఈవో ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి ఓబులమ్మ, ఏఆర్వోలు రంగస్వామి,
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ