తెలంగాణ, వికారాబాద్. 14 ఆగస్టు (హి.స.)
వికారాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నా యి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తో లోతట్టు ప్రాంతాలు జలమయం అ య్యాయి. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించగా.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరిం చడంతో ప్రజానీకానికి వర్షం టెన్షన్ పట్టు కుంది. కుండపోత వర్షం కారణంగా ప్రజా నీకం ఇళ్లకే పరిమితమైంది. అధికార యం త్రాంగం కూడా అప్రమత్తమైంది. అధికారు లంతా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ నారాయణ రెడ్డి స్పష్టమై న ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్తో పాటు అన్ని మండలాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులు పరిస్థితి సమీక్షిస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు