కాల్పుల విరమణ క్రెడిట్‌ ఇవ్వలేదని భారత్‌పై ట్రంప్‌ అక్కసు: మాజీ రాయబారి వికాస్‌ స్వరూప్‌
న్యూఢిల్లీ: , 14 ఆగస్టు (హి.స.)రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ (India)పై భారీగా సుంకాల భారాన్ని మోపారు. ఈ టారిఫ్‌లపై భారత మాజీ దౌత్యవేత్త వికాస్ స్వరూప్‌ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యల
U.S. President Donald Trump to lift sanctions imposed on Syria.


న్యూఢిల్లీ: , 14 ఆగస్టు (హి.స.)రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ (India)పై భారీగా సుంకాల భారాన్ని మోపారు. ఈ టారిఫ్‌లపై భారత మాజీ దౌత్యవేత్త వికాస్ స్వరూప్‌ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌- పాక్‌ మధ్య జరిగిన కాల్పుల విరమణలో ఎవరి ప్రమేయం లేదని న్యూదిల్లీ పేర్కొనడంతోనే సుంకాలు విధించారని విమర్శించారు.

ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌పై ట్రంప్‌ (Donald Trump) సుంకాల భారం మోపడానికి ప్రధానంగా రెండు కారణాలు కన్పిస్తున్నాయి. బ్రిక్స్‌ కూటమిలో భారత్‌ కూడా సభ్యదేశంగా ఉంది. ఈ కూటమి అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించాలనే లక్ష్యంతో ఉందని ఆయన భావిస్తున్నారు. ఇది ఆయనకు నచ్చని అంశం. మరొకటి.. ఉద్రిక్తతల తర్వాత భారత్‌- పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇది తానే చేశానని ట్రంప్‌ పదే పదే ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, కాల్పుల విరమణ చర్చల్లో మూడో దేశ ప్రమేయం లేదని న్యూదిల్లీ వాదిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande