అమరావతి, 14 ఆగస్టు (హి.స.)పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నారని మంత్రి నారా లోకేష్ ట్విట్ చేశారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు. పోలవరం పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేసిన ఓ వీడియోను.. నారా లోకేష్ ఆ ట్వీట్కు జత చేశారు. 'పోలవరం డయాఫ్రం వాల్ మొత్తం పొడవు 1396 మీటర్లకు గానూ, 500 మీటర్ల నిర్మాణం పూర్తయింది. 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా, వరదల సమయంలో సైతం డివాటరింగ్ చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి...' అంటూ నిమ్మల రామానాయుడు పోస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి