శ్రీశైలం, 14 ఆగస్టు (హి.స.)ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 1,17,221 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం ఏడు రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్ వే ద్వారా 1,87,208 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం ఈ రోజు(గురువారం) ఉదయం 6 గంటల సమయానికి 882.10 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 199.2737 టీఎంసీలు గా నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి