పులివెందులలో టీడీపీ గెలుపు.. వైఎస్ అవినాశ్ రెడ్డి రియాక్షన్
పులివెందుల , 14 ఆగస్టు (హి.స.)30 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత పులివెందుల జెడ్పీటీసీ(Pulivendula ZPTC) స్థానంలో తెలుగుదేశం జెండా ఎగిరింది. మంగళవారం ఉదయం పోలింగ్ నిర్వహించిన అధికారులు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో ఉదయం 7 గంట
పులివెందులలో టీడీపీ గెలుపు.. వైఎస్ అవినాశ్ రెడ్డి రియాక్షన్


పులివెందుల , 14 ఆగస్టు (హి.స.)30 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత పులివెందుల జెడ్పీటీసీ(Pulivendula ZPTC) స్థానంలో తెలుగుదేశం జెండా ఎగిరింది. మంగళవారం ఉదయం పోలింగ్ నిర్వహించిన అధికారులు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో ఉదయం 7 గంటలకు ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించగా.. కాసేపటి క్రితమే షాకింగ్ ఫలితం వెలువడింది. సొంత ఇలాఖాలో మాజీ సీఎం వైస్ జగన్‌కు ప్రజలు షాకిచ్చారు. టీడీపీ అభ్యర్థి, పులివెందుల అసెంబ్లీ ఇంచార్జ్ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి భారీ విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6,033 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. అయితే, లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా.. హేమంత్ రెడ్డికి 683, ఇతరులకు 239 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మారెడ్డి లతారెడ్డి పులివెందుల జడ్పీటీసీగా ఎలెక్ట్ అయినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాసేపట్లో ఆమెకు ధృవీకరణ పత్రం అందజేయనున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది. తాజాగా ఈ ఫలితాలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజమైన పోటీ జరిగి టీడీపీ గెలిచి ఉంటే బాధ ఉండేది. ఇలా గెలవడం ఒక గెలుపు కాదు. గెలిచారని మీరు అనుకోవడమే తప్ప.. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు. మీరు వేయించిన దొంగ ఓటర్లు కూడా మీ పార్టీ గెలిచిందని అనుకోరు. పోలీసుల సహకారంతో దొంగ ఓట్లు వేస్తే ఎన్నిక అంటారా?’ అని అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande