తెలంగాణ, నిర్మల్. 15 ఆగస్టు (హి.స.)
మూడవ ఆర్థిక శక్తిగా భారత్
అవతరించడం ఖాయం అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆ దిశగా ప్రధాని మోదీ టీమ్ 24 గంటలు కష్టపడుతోందన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు జాతీయ జెండా ఆవిష్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారత్ 3వ ఆర్థిక శక్తిగా వృద్ధి చెందిందని అన్నారు. అనంతరం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, గాంధీ పార్క్, ట్యాంక్ బండ్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు