అమరావతి, 15 ఆగస్టు (హి.స.)
అమరావతి: మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గుహల వద్ద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ) లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. మహిళలకు జీరో ఫేర్ టిక్కెట్ ఇచ్చి వారితో కలిసి విజయవాడ పీఎన్‌బీఎస్ సిటీ టెర్మినల్ వరకూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. బస్సు వెళ్లే మార్గంలో తెదేపా, భాజపా, జనసేన పార్టీల నేతలు బాణసంచా కాల్చారు. డీజే, తీన్మార్ డ్యాన్స్‌లతో సందడి చేశారు. ప్రతి సెంటర్‌లో థాంక్యూ సీఎం సర్ అంటూ మహిళలు నినాదాలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ