మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం.. జర ఆలోచించండి! సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.) దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విదేశీ సంస్థలను ప్రోత్సహించిన తాము.. ఈ దేశ, రాష్ట్ర సంస్థలను ఎందుకు ప్రోత్సహించమో జర ఆలోచించాలన్నారు. మిమ్మల్ని (రాష్ట్ర సంస్థ
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)

దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విదేశీ సంస్థలను ప్రోత్సహించిన తాము.. ఈ దేశ, రాష్ట్ర సంస్థలను ఎందుకు ప్రోత్సహించమో జర ఆలోచించాలన్నారు. మిమ్మల్ని (రాష్ట్ర సంస్థలు) ఎందుకు వదులుకుంటాం అని, అపోహలు సృష్టించే వాళ్లతో ప్రయాణిస్తే ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని, అప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత తనది అని సీఎం హామీ ఇచ్చారు. హైదరాబాద్ హైటెక్స్లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఈ షో కొనసాగనుంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande