నిద్రిస్తున్న చిన్నారిపై చిరుతపులి నది. ఘటన ప్రకాశం జిల్లాన్ దోర్నాల.మండలంలో
అమరావతి, 15 ఆగస్టు (హి.స.)పెద్దదోర్నాల, నిద్రిస్తున్న చిన్నారిపై చిరుతపులి దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచు గిరిజనగూడెంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గూడేనికి చెందిన కుడుముల అంజయ్య, లింగేశ్వరిలు తమ మూడేళ్ల కు
నిద్రిస్తున్న చిన్నారిపై చిరుతపులి నది. ఘటన ప్రకాశం జిల్లాన్ దోర్నాల.మండలంలో


అమరావతి, 15 ఆగస్టు (హి.స.)పెద్దదోర్నాల, నిద్రిస్తున్న చిన్నారిపై చిరుతపులి దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచు గిరిజనగూడెంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గూడేనికి చెందిన కుడుముల అంజయ్య, లింగేశ్వరిలు తమ మూడేళ్ల కుమార్తె అంజమ్మతో కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. తలుపులు వేసుకోకపోవడంతో రాత్రి ఒకటిన్నర సమయంలో చిరుతపులి వచ్చి అంజమ్మ మెడను నోటితో పట్టుకుని వెళుతుండగా.. ఆ అలికిడికి తల్లిదండ్రులు లేచి కేకలు వేశారు. దీంతో చిరుతపులి చిన్నారిని వదిలేసి వెళ్లిపోయింది. అంజమ్మ మెడ వెనుక భాగంలో గాయాలవ్వడంతో తల్లిదండ్రులు సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం అటవీశాఖ సిబ్బంది బాధితురాలిని పెద్దదోర్నాల వైద్యశాలకు తరలించారు. చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. చిరుతపులిపై నిఘా ఏర్పాటుచేసి, మనుషులపై దాడి చేయకుండా అవసరమైన చర్యలు చేపడతామని మార్కాపురం అటవీ డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సందీప్‌ కృపాకర్‌ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande