డీజీపీ జితేందర్కు మాతృవియోగం
హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.) రాష్ట్ర డీజీపీ జితేందర్కు మాతృవియోగం కలిగింది. జితేందర్ తల్లి కృష్ణ గోయల్(85) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణ గోయల్.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వి
డిజిపి జితేందర్


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.)

రాష్ట్ర డీజీపీ జితేందర్కు మాతృవియోగం కలిగింది. జితేందర్ తల్లి కృష్ణ గోయల్(85) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణ గోయల్.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రేపు ఉదయం మహాప్రస్థానంలో డీజీపీ తల్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణ గోయల్ మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సంతాపం ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande