భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శం.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మం, 15 ఆగస్టు (హి.స.) గాంధీజీ సారధ్యంలో సాగిన భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హా
మల్లు భట్టి విక్రమార్క


ఖమ్మం, 15 ఆగస్టు (హి.స.)

గాంధీజీ సారధ్యంలో సాగిన

భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అహింసే ఆయుధంగా మహాత్ముని నేతృత్వంలో బయట శత్రువులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచామని, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారధ్యంలో అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికామన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.

స్థానిక సంస్థలలో విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించిందని, సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను విభజించామన్నారు. మూడు గ్రూపులుగా యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత అని, యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించామని, 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు చేశామని భట్టి స్పష్టం చేశారు. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande