వికారాబాద్, 15 ఆగస్టు (హి.స.)
పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను
తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఖండించారు. గువ్వల బాలరాజును తానే బీజేపీలోకి పంపినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇంకా కొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి తాను వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు హాస్యాస్పదం అని పేర్కొన్నారు. సొంత పనుల మీద అమెరికా వచ్చానని, త్వరలోనే తాండూరు వస్తా అని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను గెలిపించుకుంటా అని గువ్వల బాలరాజు తెలిపారు. ఈ మేరకు అమెరికా నుంచి రోహిత్ రెడ్డి వీడియో విడుదల చేశారు.
'పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తున్నా. గువ్వల బాలరాజును నేనే బీజేపీలోకి పంపినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇంకా కొంత మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు హాస్యాస్పదంగా ఉన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరినీ నమ్మవద్దు. బీజేపీ వేల కోట్ల కాంట్రాక్టులు ఇస్తామని, ఉన్నత పదవుల ఆశ చూపింది. తెలంగాణకు అన్యాయం చేయవద్దని బీఆర్ఎస్ కంకణబద్దుడిగా, కేసీఆర్ మాసనపుత్రుడిగా నేను సాహసం చేశాను.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు