కడప) 15 ఆగస్టు (హి.స.)(:మహిళలకు ఉచిత బస్సు అమలు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని మదనపల్లె-1, మదనపల్లె-2, పీలేరు, రాయచోటి, రాజంపేట(Rayachoti, Rajampet)డిపోల్లో అవసరమైన సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేశారు. అన్ని ఆర్టీసీ డిపోల్లోని ఐదు రకాల బస్సు సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నారు. పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ లు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మాత్రం ఈ సౌకర్యం కల్పిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ