అమరావతి, 15 ఆగస్టు (హి.స.)
ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచితబస్సు ప్రయాణం పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి సీఎం విజయవాడకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులో మహిళలతో సీఎం మాట్లాడారు. అంతకుముందు ఉండవల్లి గుహల వద్దకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ