తెలంగాణ, మేడ్చల్ మల్కాజిగిరి,15 ఆగస్టు (హి.స.) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా
ఘట్కేసర్ గ్రంథాలయంలో పనిచేస్తున్న స్వీపర్ చౌహన్ నవనీతకు జాతీయ జెండా ఎగరేసే అవకాశం లభించింది. ఘట్కేసర్ గ్రంథాలయ పాలకుడు, ఇతర సిబ్బంది ఎవరు లేకపోవడంతో నవనీత విద్యార్థుల మధ్య జాతీయ జెండా ఎగరేసే గౌరవాన్ని దక్కించుకుంది. గ్రంథాలయంలో శాశ్వత ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో గత రెండు సంవత్సరాలుగా తానే మువ్వన్నెల జెండాను ఎగరేస్తున్నానని ఆనందం వ్యక్తం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు