రాజవొమ్మంగి, 15 ఆగస్టు (హి.స.)
, ఆగస్టు 15న దేశ రాజధాని దిల్లీలో జరగనున్న స్వాతంత్య్ర దిన వేడుకలకు ప్రత్యేక అతిథిగా రాజవొమ్మంగి సర్పంచి గొల్లపూడి రమణికి ఆహ్వానం అందింది. ఈనెల 11న ఆమె దిల్లీ బయలుదేరి వెళ్లారు. గురువారం పంచాయతీరాజ్ సహాయ సంచాలకులు సాయి లహరి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ‘జై శక్తి అభియాన్- క్యాచ్ ద రైన్’ (జేఎస్‌ఏ-సీటీఆర్)లో భాగంగా దేశవ్యాప్తంగా వంద మంది సర్పంచులను ఎంపికచేశారు. వీరిని ఎర్రకోట వేదికగా జరిగే జెండా పండగకు ఆహ్వానించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి సర్పంచి రమణి ఒక్కరికే అవకాశం దక్కింది. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ్, ఎమ్మెల్యే శిరీషాదేవి, లబ్బర్తి ఎంపీటీసీ సభ్యుడు పెద్దిరాజుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ