తెలంగాణ, సిద్దిపేట. 15 ఆగస్టు (హి.స.)
తెలంగాణలో కేసీఆర్ పన్నులు తగ్గిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం పన్నులను పెంచుతుండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలపై పన్నుల భారం మోపుతున్న రేవంత్పై హరీశ్రావు నిప్పులు చెరిగారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో హరీశ్రావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
రెండేళ్ల రేవంత్ పాలనలో ప్రజలపై అప్పుల, పన్నుల భారం ఎక్కువైపోయిందన్నారు. ప్రజలపై పన్నులు వేయడం లేదని శాసనసభలో చెబుతున్నారు. అసలే ఆర్థిక మాంద్యం.. వరసగా రెండో నెల డిఫ్లేషన్లో ఉంది.. తెలంగాణలో వరసగా ఇది రెండో సారి. పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం. రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాక్ ఇస్తున్నది. గత నెల, ఈ నెలలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో రెండు వేల కోట్ల భారం పడిందన్నారు.
గతంలో రూ. 100గా ఉన్న సర్వీస్ టాక్సు ఇప్పుడు రూ. 200లు చేశారు. వెహికిల్ సర్వీస్ టాక్స్ రూ. 400 నుంచి వన్ పర్సంటేజ్కు పెంచారు. రోడ్ టాక్నూ పెంచారు. మోటార్ సైకిల్ టాక్స్ను నాలుగైదు వేలకు పెంచారు. పెనాల్టీల పేరిట గత నెల వెయ్యి కోట్లు, ఈ నెల వెయ్యి కోట్లు మొత్తం రెండు వేల కోట్ల భారం మోపారు. గతంలో రూ.7100 కోట్లు టాక్స్ వసూలు అయితే.. గతేడాది రూ.6900 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. బడ్జెట్ రూ.8000 కోట్లు అంచనా వేశారు.. ఇదేలా సాధ్యం అని హరీశ్రావు ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు