అమరావతి కీలక.ప్రాంతాలన్నీ.సురక్షితంగా ఉన్నాయి
గుంటూరు,, 15 ఆగస్టు (హి.స.) సోషల్‌ మీడియాతో పాటు జగన్‌ రోతపత్రిక ఇలా దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. అమరావతిలో కీలక ప్రాంతాలన్నీ సురక్షితంగా ఉన్నాయి. యథాతథంగా రాకపోకలు కొనసాగుతున్నాయి. రాజధాని నిర్మాణ పనులూ జరుగుతున్నాయి.
भारी बारिश


గుంటూరు,, 15 ఆగస్టు (హి.స.) సోషల్‌ మీడియాతో పాటు జగన్‌ రోతపత్రిక ఇలా దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. అమరావతిలో కీలక ప్రాంతాలన్నీ సురక్షితంగా ఉన్నాయి. యథాతథంగా రాకపోకలు కొనసాగుతున్నాయి. రాజధాని నిర్మాణ పనులూ జరుగుతున్నాయి. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, మందడం, నేలపాడు, లింగాయపాలెం, వెలగపూడి, రాయపూడి, దొండపాడు, ఉద్దండరాయునిపాలెం సహా అన్ని ప్రాంతాలు అత్యంత సురక్షితంగా ఉన్నాయి. వర్షాలకు సాధారణంగా వచ్చే నీటి మడుగులు తప్ప మరింకేమీ లేవు. పంటపొలాల్లో సైతం నీరు నిలవలేదు. కోర్‌ క్యాపిటల్‌లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అన్ని భవనాల వద్ద, రహదారుల వద్ద అక్కడక్కడ నీరు నిలిచిన జాడలు తప్ప మునిగిపోయిన దాఖలాలు కనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పనులు చేపట్టిన కోర్‌ క్యాపిటల్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్ర స్థాయిలో పర్యటించింది.అమరావతిలో నుంచి ప్రవహించే కొండవీటి వాగు తాడికొండ దగ్గర కట్టతెగి పంటపొలాలపై విరుచుకుపడింది. కానీ అమరావతిలో ఆ ప్రభావం ఎక్కడా కనిపించలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande