విశాఖపట్నం, 15 ఆగస్టు (హి.స.)
:బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాలు, వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ప్రాంతాలలో కొనసాగుతోందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి నాగభూషణం వెల్లడించారు. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ